పెళ్లిలో తుపాకీతో వరుడు హల్చల్.. వణికిపోయిన బంధువులు - పెళ్లిలో కాల్పులు జరిపిన వరుడు
🎬 Watch Now: Feature Video
Groom Harsh Firing: ఉత్తరాఖండ్ రూడ్కీలో జరిగిన ఓ పెళ్లిలో వరుడు తుపాకీతో హల్చల్ చేశాడు. ఆట వస్తువులా తుపాకీని పట్టుకుని సరదాగా గాల్లోకి కాల్పులు జరిపాడు. మార్చి 24న బాసేడీ గ్రామంలోని షెహనాహి గార్డెన్లో రాజా అనే యువకుడి పెళ్లి జరిగింది. బంధువులంతా కలిసి ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలో పెళ్లి కుమారుడు రాజా.. తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో పెళ్లికి వచ్చినవారంతా భయంతో వణికిపోయారు. రాజా కాల్పుల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST