Gani: 'గని' సూపర్ టాక్.. యూనిట్ సంబరాలు - varun tej new movie
🎬 Watch Now: Feature Video
వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్ జంటగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ 'గనిటకి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఆకట్టుకునే కథ, కథనాలు ప్రేక్షకులను అలరించడం పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని నిర్మాణ కార్యాలయంలో కేక్ కట్ చేసి బాణా సంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు దర్శకుడు కిరణ్, నిర్మాత సిద్ధు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బాక్సాఫీసు వద్ద 'గనిట మరింత ఆదరణతో ముందుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST