Vijayawada fashion show: మగువల అందం, యువకుల స్టైల్.. అలరించిన ర్యాంప్‌వాక్.! - ఐకాన్ ఆఫ్ విజయవాడ ఫ్యాషన్ షో
🎬 Watch Now: Feature Video
Icon of Vijayawada fashion show: యువతీ యువకులు.. తమ అందచందాలతో ఫ్యాషన్ షోలో హెూయలొలికించారు. ర్యాంప్ వాక్ చేస్తూ.. ఫ్యాషన్ షోకి విచ్చేసిన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విజయవాడలో ఫిలిం మేకర్ రాజేశ్ నేతృత్వంలో ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి యువత వచ్చారు. ఒక వైపు యువతులు.. మరో వైపు యువకులు ర్యాంప్ వాక్ చేశారు. ఫ్యాషన్ రంగం వైపు ఆసక్తి చూపే వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. కొవిడ్ కారణంగా ఫ్యాషన్ షోలు నిర్వహించకపోవడంతో ఈ రంగంపై ఆసక్తి చూపుతున్న యువతకు తీవ్ర నిరాశ ఎదురవుతోందన్నారు. ఈ ఐకాన్ ఆఫ్ విజయవాడ ఫ్యాషన్ షోకు ముఖ్య అతిథిగా బిగ్ బాస్- 5 కంటెస్టెంట్ జశ్వంత్ వచ్చారు.