Tips to Look Young and Beautiful: మనలో చాలా మంది అందంగా కనిపించాలని ఆహారపు అలవాట్లను మార్చుకుంటుంటారు. ఇంకా అనేక రకాల కసరత్తులపైన దృష్టి పెడుతుంటారు. అయితే, ఇవే కాకుండా దైనందిన జీవితంలో కొన్ని అలవాట్లను భాగం చేసుకుంటే అందంగా, ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తగినంత నీరు తాగాలి : రోజుకు తగినంత నీరు తాగడం చర్మాన్ని హైడ్రేట్ చేసి, యవ్వనంగా ఉంచుతుందని నిపుణులు అంటున్నారు. 2018లో Journal of Investigative Dermatology ప్రచురితమైన "The role of hydration in skin aging" అనే అధ్యయనంలో ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
సరైన ఆహారం : మనం తినే ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినాలని నిపుణులు అంటున్నారు. మైండ్ ఫుల్ ఈటింగ్ వల్ల శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుందని తెలిపారు. ఫలితంగా జీర్ణ క్రియ మెరుగుపడుతుందని వివరిస్తున్నారు. ముఖ్యంగా ప్రోటీన్లు, విటమిన్లతో కూడిన ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.
డ్యాన్ చేయాలట: రోజూ డ్యాన్స్ చేస్తే శరీరం చురుగ్గా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆనందం సొంతం అవుతుందని తెలిపారు. రోజులో కొంత సమయం దీనికి కేటాయించాలని సూచిస్తున్నారు. 2018లో Journal of Aging and Physical Activityలో ప్రచురితమైన The effects of dance on physical and mental health in older adults" అనే అధ్యయనంలో తేలింది.
నవ్వుతో ఒత్తిడి తగ్గించుకోవాలి: ఒత్తిడిని తగ్గించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నవ్వుకి ఒత్తిడి తగ్గించే శక్తి ఉందని అంటున్నారు. రోగనిరోధక శక్తిని పెంచుతుందని తెలిపారు. రోజులో కాసేపు ఫ్రెండ్స్, ఫ్యామిలీతో చిట్‌చాట్ పెట్టి హాయిగా నవ్వాలని సూచిస్తున్నారు.
ప్రకృతితో మమేకం: ప్రకృతిని ఆస్వాదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రకృతిలో స్వచ్ఛమైన గాలి, ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు. ఇంకా కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ ఉండాలని.. దీని వల్ల మెదడు చురగ్గా పనిచేయడంతో పాటు ఉత్సాహంగా ఉంటుందని అంటున్నారు.
8 గంటల నిద్ర: స్క్రీన్ టైమ్‌ను తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. నీలి కాంతి వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి.. నిద్రపై ప్రభావం చూపుతుందని తెలిపారు. ఫలితంగా నిద్రలేమిగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రతిరోజు తప్పనిసరిగా 7-8 గంటలు నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
యోగా: యెగా, ధ్యానంతో పాటు శ్వాస వ్యాయామాలు సాధన చేయాలని సూచిస్తున్నారు. రోజు పది నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయడం వల్ల నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని.. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు.
వ్యాయామం: ఇంకా నడక, జాగింగ్, ఈత వంటి వ్యాయామాల చేయడం వల్ల శరీరం చురుగ్గా ఉంటుందని తెలిపారు. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం మంచిదని సూచిస్తున్నారు.
చర్మ సంరక్షణ: ఇంకా యవ్వనంగా కనిపించాలంటే సన్‌స్క్రీన్, మాయిశ్చరైజర్, ఫేస్ ప్యాక్స్ ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటి వల్ల చర్మం హైడ్రేట్‌గా ఉండడమే కాకుండా మెరిసిపోతుందని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా?- ఈ జాగ్రత్తలు పాటించకపోతే ముప్పు తప్పదట!
అన్ వాంటెడ్ హెయిర్‌తో ఇబ్బందా? ఫేస్ వ్యాక్సింగ్ కంటే ఈజీగా నొప్పి లేకుండా క్లీన్!