Tea Day 2023 : 'టీ'తో గుండె జబ్బులు, క్యాన్సర్‌కు చెక్!
🎬 Watch Now: Feature Video
Tea Day 2023 : మనలో చాలా మందికి ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు మొదలవ్వదు. సహజంగా టీ.. నరాల ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. మనం తాగిన వెంటనే మనకు ఓ శక్తిమంతమైన భావనను కలిగిస్తుంది. అయితే, అధికంగా టీ తాగడం వల్ల అనేక దుష్పరిణామాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. తగినంత మోతాదులో తీసుకోవడం వల్ల అనారోగ్యాల నుంచి మనల్ని కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. 'అంతర్జాతీయ టీ'డే మే 21(ఆదివారం)న సందర్భంగా టీ గురించి ఓ సారి తెలుసుకుందాం.
టీని తాగడం వల్ల మైండ్ యాక్టివ్ ఉంటుందని న్యూట్రిషనిస్ట్ లక్ష్మి తేజస్వీ చెబుతున్నారు. టీలో యాంటి ఆక్సిడెంట్లు ఉంటానని.. ఇవి గుండె సంబంధిత జబ్బులు రాకుండా అడ్డుకుంటాయని ఆమె అంటున్నారు. క్యాన్సర్‌ను అడ్డుకోగల శక్తి కూడా టీకి ఉందని తేజస్వీ తెలిపారు. టీని ఎక్కువగా తాగడం వల్ల అసిడిటీ, గుండెలో మంట వచ్చే అవకాశం ఉందని ఆమె చెబుతున్నారు.
'గ్రీన్ టీ, బ్లాక్ టీ, అల్లం టీ ఇలా పలు రకాల టీలను తాగుతారు. అన్నింటినిలోనూ కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. టీని రోజుకు రెండు కప్పులు తీసుకోవడం మంచిది. అంతకంటే ఎక్కువ తాగకపోవడం ఉత్తమం. అలాగే ఉదయం వేళ ఖాళీ కడుపుతో కాకుండా టిఫిన్ చేసిన తర్వాత టీని తాగడం మంచిది. టీలో పొటాషియం, మాంగనీసు, కాపర్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి. 'అని న్యూట్రిషనిస్ట్ లక్ష్మి తేజస్వీ చెబుతున్నారు. ఆమె చెప్పే మరిన్ని వివరాల కోసం వీడియోను చూడండి.