ETV Bharat / spiritual

ఆ రాశివారు వివాదాలకు దూరంగా ఉంటే మంచిది- శివారాధన చేయడం మేలు! - HOROSCOPE TODAY

2025 ఫిబ్రవరి 4వ తేదీ (మంగళవారం) రాశిఫలాలు

Horoscope
Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 4, 2025, 4:01 AM IST

Horoscope Today February 4th 2025 : 2025 ఫిబ్రవరి 4వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజంతా శాంతిమయంగా గడుస్తుంది. శారీరకంగానూ, మానసికంగానూ శక్తివంతమంగా ఉంటారు. చేపట్టిన అన్ని పనులు ఉత్సాహంతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మాతృ సంబంధమైన ఆర్థిక లబ్ధి ఉండవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. మీ ప్రియమైన వారితో విబేధాలు తలెత్తవచ్చు. కుటుంబ వాతావరణం అనిశ్చితిగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ధర్మచింతనతో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. ఉన్నతాధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. పెద్దల ఆశీర్వాదం, దైవబలం అండగా ఉంటాయి. కీలక వ్యవహారంలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఉత్తమం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు రాకుండా జాగ్రత్త పడండి. వృత్తి వ్యాపారాలలో తోటివారి సహకారంతో పనిచేస్తే మంచిది. కుటుంబంలో చిన్నవారి పట్ల శ్రద్ధ చూపిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అందరి సహకారంతో చేపట్టిన పనులు ఫలవంతం అవుతాయి. బుద్ధిబలంతో క్లిష్టమైన సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఆదిత్య హృదయం పారాయణ శుభకరం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడానికి అనువైన సమయం. గత కొంత కాలంగా వాయిదా పడుతున్న పనులను చక్కని ప్రణాళికతో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక అంశాల పట్ల, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అభయ ఆంజనేయస్వామి ఆలయ సందర్శం శుభకరం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఉత్సాహం లోపించకుండా చూసుకోండి. పనిభారంతో ఒత్తిడి పెరుగుతుంది. పదునైన మాటలతో సన్నిహితుల మనసు గాయపరుస్తారు. వివాదాలు, సమస్యలకు దూరంగా ఉంటే మంచిది. శివారాధన మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం ఈ రోజు మొత్తం సానుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో గొప్ప విజయాలు సాధిస్తారు. మీ విరోధులు తమ ఓటమిని అంగీకరిస్తారు. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. విశేషమైన ఆర్థిక లాభాలు పొందడానికి అవకాశం ఉంది. పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అధికారుల అండదండలుంటాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో అనుకూలత ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో ఏకాగ్రత లోపించకుండా జాగ్రత్త పడండి. బద్ధకం, నిరుత్సాహం దరి చేరనీయవద్దు. స్థిర నిర్ణయాలు విజయం చేకూరుస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో అడుగడుక్కీ ఆటంకాలు ఏర్పడడం చికాకు కలిగిస్తుంది. మనోబలం తగ్గకుండా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో దైవారాధన మానవద్దు. కీలక వ్యవహారాల్లో ఆచి తూచి అడుగేస్తే మంచిది. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. మంచి చేయబోతే చెడు ఎదురుకావచ్చు. సహనంతో ఉండడం అవసరం. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చుట్టు ప్రక్కల వాతావరణం అంతా విరోధులతో నిండి ఉంటుంది. కొన్ని అవాంఛనీయమైన ఘటనలు చెలరేగి మీకూ, మీ బంధువులకూ మధ్య విభేదాలు నెలకొనే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైన విషయాలలో తగు జాగ్రత్త వహించండి. ఖర్చులను కాస్త అదుపులో పెట్టుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.