చీరకట్టులో మనసు దోచిన మగువలు - హైదరాబాద్‌లో ఫ్యాషన్ షో
🎬 Watch Now: Feature Video

Fashion Show in Hyderabad : సంప్రదాయ వస్త్రాల్లో మగువలు వీక్షకుల మనసు దోచేశారు. హొయలొలికించే హంస నడకలతో చూపరులను ముగ్ధుల్ని చేశారు. ర్యాంప్ వాక్‌పై అతివల సొగసు అందరితో వాహ్వా అనిపించింది. హైదరాబాద్ తాజ్‌కృష్ణ హోటల్‌లో మూడు రోజుల పాటు జాతీయ స్థాయి వస్త్రాభరణాల ప్రదర్శన నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మార్క్‌మీడియా కూడలిలో గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సినీ నటి సహస్త్ర రెడ్డితో పాటు పలువురు మోడల్స్ పాల్గొన్ని సందడి చేశారు. ఉగాది సందర్భంగా సరికొత్త రకాలు అందుబాటులో ఉంచామని నిర్వాహకులు తెలియజేశారు. సంప్రదాయ వస్త్రాలు ధరించిన మోడల్స్ర్యాం ప్ పై హొయలొలికించారు.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST