నాగలికి ఎద్దులు బదులు గుర్రాలు.. 'మహా' రైతు వెరైటీ వ్యవసాయం! - గుర్రాలతో వ్యవసాయం
🎬 Watch Now: Feature Video
Farming With Horses: ఎద్దులు, ట్రాక్టర్లను కొనుగోలు చేసే స్తోమత లేని ఓ రైతు గుర్రాలతోనే వ్యవసాయం చేస్తున్నాడు. తన పిల్లల కోసమని ఎప్పుడో కొన్న గుర్రాలను ప్రస్తుతం పొలం పనులకు వినియోగించుకుంటున్నాడు. మహారాష్ట్రలోని వాషీమ్ జిల్లా షెల్గావ్ ఘుజే ప్రాంతానికి చెందిన భావూరావ్ సుర్యభన్ ధన్గర్. మొదట.. రాజు అనే గుర్రాన్ని కొని బారాత్లో ఉపయోగించేందుకు విఫలయత్నం చేశాడు ధన్గర్. కానీ ఆ తర్వాత దానిని వ్యవసాయానికి ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే తుల్ష అనే మరో గుర్రాన్ని కూడా కొని సాగుకు ఉపయోగిస్తున్నాడు. ఈ రెండు గుర్రాలు సాగు సహా తన రోజువారీ పనులకు ఎంతో ఉపయోగపడుతున్నాయని అంటున్నాడు భావూరావ్.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST