వారణాసిలో గంగా హారతి - మధురైలో హోమాలు - రోహిత్ సేన గెలుపు కోసం దేశవ్యాప్తంగా పూజలు - మధురై రోటరీ క్లబ్లో టీమ్ఇండియా కోసం పూజలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-11-2023/640-480-20026728-thumbnail-16x9-team-india.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Nov 15, 2023, 10:59 AM IST
World Cup Semi Finals 2023 : ఈ ఏడాది ప్రపంచకప్ ఎంతో రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు లీగ్ దశ జరగ్గా.. ఇక నుంచి అసలు పోరు మొదలవ్వనుంది. ఇందులో భాగంగా ఎంపికైన నాలుగు జట్లు సెమీస్‌లో ఆడనున్నాయి. ఈ క్రమంలో ముంబయి వాంఖడే స్టేడియం వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య తొలి సెమీస్ జరగనుంది. దీంతో మన జట్టు గెలవాలని క్రికెట్ లవర్స్ ఆకాంక్షిస్తున్నారు. దేశమంతట ఉన్న అభిమానులు వివిధ రకాలుగా తమ అభిమానాన్ని తెలుపుతున్నారు. పూజలు, నినాదాలతో రోహిత్ సేనకు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే ముంబయిలోని వాంఖడే వేదికకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివస్తున్నారు. ప్లకార్డులు, వరల్డ్ కప్ నమూనా, పోస్టర్లను చేతపట్టుకుని ఇండియా గెలుస్తుందంటూ నినాదాలు చేస్తున్నారు.
మరి కొందరైతే పూజలు చేస్తూ సెమీస్‌లో భారత జట్టు గెలవాలని ప్రార్థిస్తున్నారు. మధురైలోని జల్లి కట్టు రోటరీ క్లబ్‌కు చెందిన క్రికెట్ లవర్స్.. ఆ క్లబ్ వేదికగా ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. దేవుడి ముందు వరల్డ్ కప్ జట్టులో ఉన్న ప్లేయర్ల ఫొటోలు ఉంచి పూజలు చేశారు.
ఇక వారణాసిలోని కొందరు అభిమానులు ఘాట్స్ వద్దకు వచ్చి గంగా దేవికి హారతి ఇచ్చారు. క్రికెట్ బ్యాట్లతో పాటు జాతీయ జెండాలు పట్టుకుని టీమ్ఇండియా గెలవాలంటూ మద్దతు పలికారు.
మరోవైపు ఒడిశాలోని సైకత శిల్పి సుదర్శన్ కూడా తనదైన శైలిలో అభిమానాన్ని చాటారు. పూరీ బీచ్ ఒడ్డున ఓ భారీ బ్యాట్ రూపొంలో ఉన్న సైకత శిల్పాన్ని రూపొందిచారు. టీమ్ఇండియాకు ఆల్ ద బెస్ట్ చెప్పారు.