thumbnail

By

Published : Jun 14, 2023, 8:07 PM IST

ETV Bharat / Videos

'ఆమె'తో పెళ్లి కోసం జాతక శాస్త్రం చదివేసిన హీరో.. శివ బాలాజీ- మధుమిత లవ్​స్టోరీలో ట్విస్ట్!

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలానే టాలీవుడ్​లో సైతం చాలా మంది ప్రేమించి.. అనేక కష్టాలు ఎదుర్కొని చివరకు వివాహ బంధంతో ఒకటయ్యారు. అలాంటి టాలీవుడ్ క్యూట్ కపుల్స్​లో శివ బాలాజీ, మధుమిత జంట ఒకటి. వీరిద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇంగ్లీష్ కారన్ అనే సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ టైమ్​లోనే వీరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. చివరకు 2009లో పెద్దల సమక్షంలో వీరిద్దరు ఒక్కటయ్యారు. 

తాజాగా ఈ జంట.. ఈటీవీలో ప్రసారమవుతున్న 'అలా మొదలైంది' సెలబ్రిటీ టాక్​ షోకు అతిథులుగా వచ్చారు. వెన్నెల కిషోర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో శివ బాలాజీ, మధుమిత పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అయతే మధుమితను పెళ్లి చేసుకుంటే వాళ్ల అమ్మ చనిపోతుందనే భయంతో ఆమెతో పెళ్లికి శివ బాలాజీ బ్రేకప్ చెప్పారట. ఆ తర్వాత ఏడాదిన్నర కాలం పాటు దూరంగా ఉండి.. చివరకు మళ్లీ పెళ్లికి ఒప్పించారట. అయితే మధుమితతో పెళ్లి కోసం ఏకంగా శివ బాలాజీ జాతక శాస్త్రాన్నే చదివేశారట!

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.