thumbnail

By

Published : Mar 23, 2023, 8:33 PM IST

ETV Bharat / Videos

'దసరా' ప్రమోషన్స్​.. నాగ్​పుర్​లో ట్రాక్టర్​పై నాని రయ్​ రయ్​..

క్లాప్ అసిస్టెంట్ నుంచి నేచురల్ స్టార్ గా ఎదగడానికి తన కోసం దర్శకులు రాసిన మంచి కథలేనని యువ కథానాయకుడు నాని అన్నారు. ఆ కథలకు తగిన విధంగా సహజత్వానికి దగ్గరగా తన ప్రవర్తన ఉండటం వల్లే తెలుగు చిత్ర పరిశ్రమ నేచురల్ స్టార్​గా గుర్తించిందని పేర్కొన్నారు. తన కొత్త చిత్రం 'దసరా' ప్రచారంలో భాగంగా నాగ్ పుర్ వెళ్లిన నాని.... అక్కడి సామాన్య ప్రజలు, దుకాణాదారులు, ఛాయ్ వాలాలతో ముచ్చటిస్తూ వారితో గడిపారు. అక్కడి వారందరితో కలిసి సందడి చేశారు. ఓ ట్రాక్టర్ పై రయ్ రయ్​ అంటూ షికార్లు కొట్టారు. అక్కడి థియేటర్ లో ప్రేక్షకులకు కలుసుకున్నారు. దసరా చిత్ర విశేషాలతో పాటు ఆ చిత్రం కోసం తాను పడిన శ్రమను వివరించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కాగా, మార్చి 30న దసరా ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నానికి జోడిగా కీర్తి సురేష్ నటించింది. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.