రిలీజ్‌కు ముందే డైరెక్టర్‌పై నాని ఫైర్.. 'అనుకున్నంత బాగా దసరా తీయలేదు!' - సుమ అడ్డాలో నాని షాకింగ్ కామెంట్స్
🎬 Watch Now: Feature Video
నేచురల్ స్టార్ నాని-కీర్తి సురేశ్ కలిసి నటించిన సినిమా 'దసరా'. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. సముద్రఖని, సాయికుమార్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో, బొగ్గు గనుల ఇతివృత్తంగా ఈ సినిమాను రూపొదించారు. పాన్ ఇండియా స్థాయిలో మార్చి 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్‌లో ఫుల్‌గా జోరు పెంచింది మూవీటీమ్. ముఖ్యంగా నాని ప్రచారంలో జోరుగా పాల్గొంటూ సినిమాను ఆడియన్స్‌కు దగ్గరయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పాటలు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా దసరా మూవీటీమ్.. తెలుగు బుల్లితెర షో 'సుమ అడ్డా'కు గెస్ట్లుగా విచ్చేసి సందడి చేసింది. ఈ షోలో.. ఎప్పటిలాగే సుమ తమ మార్క్ కామెడీతో నవ్వులు పూయించింది. అలాగే నాని కూడా సుమతో కలిసి చేసిన హాస్యం.. కితకితలు పెట్టించింది. ఇక ఈ షోలో నాని సరదాగా క్రికెట్ ఆడుతూ కనిపించారు. ఈ క్రమంలోనే సుమ.. నానిని పలు ఆసక్తికరమైన ప్రశ్నలను అడిగింది. 'మీకు మీ వైఫ్ కన్నా మీ అబ్బాయే ఎక్కువ ఇష్టం' అని అడగగా.. అవును, కాదు అంటూ రెండు సమాధానాలు చెప్పారు నాని. 'తెలుగు ఇండస్ట్రీలో మీకు పోటీనిచ్చే హీరో లేడు', 'దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గురించి చెప్పండి' అని అడగగా.. వీటికి తనదైన స్టైల్లో నాని షాకింగ్ ఆన్సర్స్ ఇచ్చారు. ఆ వీడియోను మీరూ చూసేయండి..