మనవరాలి కోసం రాత్రంతా ఆస్పత్రిలోనే ఉన్న చిరు!.. కేక్ కట్ చేసి ఫ్యాన్స్ సంబరాలు.. - మెగా ప్రిన్సెస్
🎬 Watch Now: Feature Video
Ram Charan Baby : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన మంగళవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్టు అపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీంతో అటు మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కూడా వేడుకలు చేసుకుంటున్నారు. కాగా ఉపాసన డెలివరీ కోసం చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ సోమవారం రాత్రి ఆస్పత్రికి చేరుకున్నారు.
మెగాప్రిన్సెస్ను చూసి ఉబ్బితబ్బిపోయిన చిరు.. రాత్రంతా అక్కడే ఉన్నారని సమాచారం. అటు కామినేని కుటుంబసభ్యులు కూడా తమ మనవరాలిని చూసేందుకు వచ్చినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో సైతం ఈ సంతోషకరమైన విషయాన్ని అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. చిరు కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రి వద్ద మెగా అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు చెర్రీ దంపతులకు కంగ్రాజ్యులేషన్స్ తెలుపుతున్నారు.