Kashmir Files National Awards : 'వారి వల్లే మా సినిమాకు అవార్డులు.. ఎవరికీ భయపడేదే లేదు' - pallavi joshi national award
🎬 Watch Now: Feature Video
Published : Aug 25, 2023, 3:51 PM IST
Kashmir Files National Awards : కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 69వ జాతీయ అవార్డుల్లో.. 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాకు జాతీయ ఉత్తమ సమగ్రతా చిత్రం, ఉత్తమ సహాయ నటి కేటగిరీల్లో రెండు పురస్కారాలు దక్కాయి. కాగా ఈ సినిమాకు మొదటిరోజు నుంచే కొంతమంది అడ్డంకులు సృష్టించారని చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ గుర్తుచేశారు. 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాకు నేషనల్ అవార్డులు రావడం వెనుక ఎలాంటి లాబీయింగ్ లేదని నిర్మాత అభిషేక్ స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల మద్దతుతోనే 'కశ్మీర్ ఫైల్స్' చిత్రానికి రెండు జాతీయ పురస్కారాలు దక్కాయని అగర్వాల్ అన్నారు. ఇక ఈ సినిమాపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు అభిషేక్. ఆయన వ్యాఖ్యలు దేశాన్ని ప్రశ్నించేలా ఉన్నాయని పేర్కొన్నారు. విమర్శించే వారందరికీ తాము సమాధానం చెప్పలేమన్నారు. తమ పని తాము చేసుకుంటూ.. దేశంలో ధర్మాన్ని రక్షించడమే తమ ధ్యేయమని అగర్వాల్ పేర్కొన్నారు. ప్రజల మద్దతు ఉన్నంత వరకు తాను, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. కశ్మీర్ పండిట్లకు, సినిమాకు మద్దతుగా నిలిచిన ప్రజలకు.. ఈ పురస్కారాలను అంకితం ఇస్తున్నట్లు అభిషేక్ అగర్వాల్ తెలిపారు.