Jailer Fans Celebrations : రజనీ కోసం చెన్నై వచ్చిన జపాన్ ఫ్యాన్స్.. ప్రపంచమంతా 'జైలర్' ఫీవర్! - తమిళనాడులో జైలర్ మూవీ సెలబ్రేషన్స్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-08-2023/640-480-19228415-thumbnail-16x9-jailer-fans-celebration.jpg)
Jailer Fans Celebrations : వీకెండ్‌తో సంబంధం లేకుండా, ఫెస్టివల్ సీజన్ రాకుండానే రజనీ ఫ్యాన్స్ అంబరాన్నంటేలా సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి కారణం ఆయన లేటెస్ట్ మూవీ 'జైలర్' రిలీజ్. ప్రపంచవ్యాప్తంగా పలు థియేటరల్లో గురువారం విడుదలైన ఈ సినిమా తొలి షో నుంచే బాక్సాఫీస్ ముందు దూసుకెళ్తోంది. దీంతో ఎక్కడ చూసిన ఇప్పుడు ఈ సినిమా గురించే టాక్ నడుస్తోంది.
Rajni Japan Fans Visit Chennai : అయితే రజనీకి ఇండియాలోనే కాదు ఓవర్సీస్లోనూ మంచి క్రేజ్ ఉంది. యూఎస్, జపాన్ లాంటి దేశాల్లో ఆయన సినిమా టిక్కెట్ల కోసం క్యూ కట్టే జనాలున్నారు. తాజాగా జపాన్‌కి చెందిన ఓ జంట జైలర్ సినిమా చూసేందుకు జపాన్ నుంచి చెన్నైకి వచ్చారు. వారు గత కొన్నేళ్లుగా రజనీ ఫ్యాన్స్ అని.. ఈ సినిమా చూసేందుకే జపాన్ నుంచి వచ్చామంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఆయన సినిమాల్లోని ఫేమస్ డైలాగ్స్‌ను ఆ ఫ్యాన్స్ అవలీలగా చెప్తున్నారు. దీని బట్టి రజనీకి ఏ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఇట్టే చెప్పేయచ్చు.
Rajni Fans Celebrations : ఫస్ట్‌డే ఫస్ట్ షో అంటూ థియేటర్ల వద్ద రజనీ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో తమిళనాడులోని పలు థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. డ్యాన్స్‌లు, నినాదాలు, బాణసంచా పేలుళ్లతో సంబరాలు చేసుకుంటున్నారు. సూపర్‌స్టార్ కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుతున్నారు. మదురైలోని కొంతమంది ఫ్యాన్స్ అయితే విన్నూత్నంగా 'జైలర్' కోసం ఖైదీల దుస్తుల్లో వచ్చారు. ఒక్క తమిళనాడులోనే కాదు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో తలైవా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. దీంతో ఎక్కడ చూసిన 'జైలర్' మేనియా నడుస్తోంది.