అమెరికాలో పెట్రోల్ బాయ్, టెర్రరిస్ట్ పాత్రలు ఇస్తారట! అందుకే అడవి శేష్ తెలుగు హీరో అయ్యారట!! - అడివి శేష్ మూవీస్ లిస్ట్
🎬 Watch Now: Feature Video
Published : Dec 17, 2023, 7:02 AM IST
|Updated : Dec 17, 2023, 7:30 AM IST
Hero Adivi Sesh Birthday Special : చూసేందుకు హాలీవుడ్ హీరోలా కనిపిస్తారు కానీ ఆయన అచ్చ తెలుగు కుర్రాడే. జానర్ ఏదైనా అవలీలగా చేసే ఈ స్టార్ హీరో తన మెస్మరైజింగ్ యాక్టింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని దూసుకెళ్తున్నారు. యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. మంచి నటుడిగా మాత్రమే కాకుండా చక్కటి రచయితగా, డైరెక్టర్‌గా ప్రేక్షకుల నాడి పట్టుకుంటున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలతో సంచలనాలు చేస్తుంటారు. ఆయనెవరో కాదు యంగ్ హీరో అడివి శేష్.
ఎవరు, హిట్, గూఢచారి లాంటి సూపర్ హిట్ సినిమాలతో అభిమానులను ఆకట్టుకున్న ఈ స్టార్ హీరో చేతిలో మరో రెండు సూపర్ ప్రాజెక్టులతో ప్రస్తుతం బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే అమెరికాలో ఉంటున్న ఆయన సడెన్‌గా భారత్‌కు ఎందుకు వచ్చారు? తెలుగు సినిమాల్లో హీరో ఎలా అయ్యారు? ఆయనకు పెళ్లి ప్రపోజల్స్ ఎన్ని వచ్చాయి? మరి శేష్ వివాహం ఎప్పుడు? అన్న విషయాలు ఆయన మాటల్లోనే.