Hail Rain in Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం - Hail rain occurred in places
🎬 Watch Now: Feature Video
Hail rain in Hyderabad: హైదరాబాద్ నగరవాసులను వర్షం పలకరించింది. పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది. బేగంబజార్, కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లిబర్టీ, నారాయణ గూడ, హిమాయత్ నగర్, లక్డీకపూల్, గోషామహల్ తదితర ప్రాంతాల్లో వడగండ్ల వాన పడింది. చంచల్‌గూడ, సైదాబాద్, చంపాపేట, లిబర్టీ, బషీర్‌బాగ్, హైదర్‌గూడలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో రోడ్లపై పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. వాహన దారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు.
ట్రాఫిక్ స్తంభించి కొన్ని చోట్ల ప్రయాణికులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు.. అకస్మాత్తుగా వర్షం కురవడంతో కాస్త ఉపశమనం లభించినట్లయింది. సాయంత్రం వేళ కురిసిన ఈ వర్షం.. ఎంతో హాయిని కలిగించిందని.. నగరంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నగరంలో ఎండలు ఎక్కువగా ఉన్నందున నీరు ఆవిరిగా మారి వర్షం పడిందని నిపుణలు చెబుతున్నారు. సంవాహన వర్షపాతం రకానికి చెందినదని అంటున్నారు.