Ambani Ganesh Chaturthi Celebration 2023 : అంబానీ గణేశ్ వేడుకల్లో సౌత్ స్టార్స్ సందడి.. వీడియో చూశారా? - అంబానీ సెలబ్రేషన్స్ అలీయా భట్
🎬 Watch Now: Feature Video


Published : Sep 20, 2023, 10:06 AM IST
Ambani Ganesh Chaturthi Celebration 2023 : ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఇంట.. సెప్టెంబర్ 19 రాత్రి గణేశ్ చతుర్థి వేడుకలు గ్రాండ్గా జరిగాయి. ఈ వేడుకకు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు.. భారీగా తరలివచ్చి గణేశుడిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. వీరిలో సౌత్ స్టార్స్ కూడా సందడి చేశారు. దర్శకుడు అట్లీ, నయనతార విఘ్నేష్ దంపతులు, రష్మికతో కనిపించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్యా రాయ్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె, సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీ, ఆయుషాన్ ఖురానా, హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్, అతియా శెట్టి, రష్మిక, అనన్య పాండే, ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశాల్.. తమ కుటుంబాలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఇంకా పలువురు సినీ, క్రీడా తారలు కూడా ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. దీంతో అక్కడంతా సందడి వాతావరణం నెలకొంది.