ఆహారం పెడుతున్న బాలుడిపై ఏనుగు దాడి- లక్కీగా తండ్రి పక్కనే ఉండి... - elephant attack today
🎬 Watch Now: Feature Video
Elephant attack video: ఏనుగుకు ఆహారం అందించేందుకు వెళ్లిన నాలుగేళ్ల బాలుడికి తృటిలో ప్రమాదం తప్పింది. ఏనుగు ఒక్కసారిగా దాడి చేయగా చిన్నారి తండ్రి చాకచక్యంగా అతడ్ని కాపాడాడు. కేరళ కొజికోడ్-మలప్పురం సరిహద్దుల్లోని పళంపరంబులో జరిగిందీ ఘటన. కొలక్కాడన్ మినీ ఏనుగును ఓ గుడి వద్ద కట్టేసి ఉంచగా.. తండ్రీకొడుకులు కలిసి ఆహారం పెట్టేందుకు వెళ్లారు. బాలుడిపై ఏనుగు ఒక్కసారిగా ప్రతాపం చూపించగా.. తండ్రి తన కుమారుడ్ని రక్షించాడు. రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘటన వీడియోను ఇప్పుడు కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వెలుగులోకి వచ్చింది.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST