Siberian Birds : విదేశీ విహంగం.. స్వేచ్ఛా విహారం! - Siberian Birds
🎬 Watch Now: Feature Video

విదేశీ విహంగాలు రెక్కలు కట్టుకుని అనంతపురం గడ్డపై వాలిపోయాయి. అనంతపురం జిల్లా గుడిబండ మండల కేంద్రం చెరువులో సైబీరియన్ పక్షులు.. సందడి చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా చేరి అక్కడి ప్రజల్లో ఆనందం నింపుతున్నాయి. ఆహారం కోసం ఈ పక్షులు ఖండాలు దాటుకొని వలసలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలో గుడిబండ చెరువు వద్ద విహరిస్తున్నాయి. చెరువులో నీరు అడుగంటడంతో చేపలను తింటూ.. వారం రోజులుగా ఇక్కడే మకాం వేశాయి. ప్రజలు ఈ పక్షులను ఆసక్తిగా తిలకిస్తున్నారు.