Live Video: పాములకు రాఖీ కట్టేందుకు యత్నం- వ్యక్తి మృతి - రక్షా బంధన్
🎬 Watch Now: Feature Video
రక్షా బంధన్(raksha bandhan) రోజున ఓ వ్యక్తి అత్యుత్సాహం అతని ప్రాణాలు పోయేలా చేసింది. బిహార్ సారణ్ జిల్లాలోని మాంజీ సీతల్పుర్ గ్రామానికి చెందిన మన్మోహన్ అలియాస్ భూవర్ అనే వ్యక్తి పాములు పడుతూ జీవనం సాగిస్తున్నాడు. పాము కాటుకు(Snake bite) గురైన వారికి చికిత్స చేయటంలో చుట్టుపక్కల మంచి పేరుంది. రక్షా బంధన్ రోజున స్థానికుల సమక్షంలో పాములకు రాఖీ కట్టే సాహసానికి పూనుకున్నాడు. రెండు విష సర్పాలను పట్టుకుని రాఖీ కట్టి, వాటిని దీవించే క్రమంలో ఓ పాము కాలిని కరిచింది. నిర్లక్ష్యం చేయటం వల్ల చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే.. ఎంతో మందికి నయం చేసిన మన్మోహన్.. అదే పాము కాటుకు బలవటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు స్థానికులు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.