మెడ లోతు నీటిలో నుంచి వెళితేనే అంత్యక్రియలు - మెడ లోతు నీటిలోంచి వెళితేనే అంత్యక్రియలు
🎬 Watch Now: Feature Video
తమిళనాడువ్యాప్తంగా కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. అరియలూర్ జిల్లా కళువన్తొండి గ్రామంలోని నైనార్ చెరువు నీటి మట్టం ప్రమదకర స్థాయికి చేరింది. ఈ చెరువు కింద ఉన్న శ్మశానవాటికనే గ్రామస్థులు వినియోగిస్తారు. మంగళవారం ఓ వ్యక్తి మరణించగా ప్రమాదకర స్థాయిలో మెడ లోతు నీటిలో మృతదేహాన్ని మోసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది.