కారులో నలుగురు యువకులు.. ఒక్కసారిగా మంటలు! - కారు ఇంజిన్లో చెలరేగిన మంటలు
🎬 Watch Now: Feature Video
దిల్లీ, కేశవపురమ్ ప్రాంతంలో మెట్రో స్టేషన్కు సమీపాన ప్రధాన రహదారిపై వెళుతున్న ఓ కారు ఇంజిన్లో హటాత్తుగా మంటలు చెలరేగాయి. ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో కారులో నలుగురు యువకులు ఉన్నారు. మంటలు చెలరేగిన క్రమంలో కారును రోడ్డుపైనే నిలిపేసి.. బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక విభాగం ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. మంటలు చెలరేగేందుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.