viral video: కదులుతున్న రైలు ఎక్కేందుకు విద్యార్థిని స్టంట్స్ - వైరల్ వీడియో
🎬 Watch Now: Feature Video
తమిళనాడు తిరువల్లూర్ జిల్లాలోని కవరైపెట్టై రైల్వే స్టేషన్లో(train viral video) ఇద్దరు విద్యార్థులు ప్రమాదకర రీతిలో స్టంట్స్ చేశారు. కదులుతున్న రైలును ఎక్కుతూ ఓ విద్యార్థిని స్టిల్స్ ఇచ్చింది. రైలు ఎక్కిన తర్వాత కూడా కాలు బయటపెట్టింది(train chasing viral video). ఆమె వెనకే ఉన్న మరో విద్యార్థి కూడా అదే పని చేశాడు. వారు పరిగెత్తి రైలు ఎక్కిన రెండు, మూడు సెకన్ల తర్వాత ట్రైన్.. ప్లాట్ఫార్మం దాటింది. వారిద్దరూ పాఠశాల యూనిఫాం ధరించి ఈ స్టంట్స్ చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.