రోగిని మంచులో 15కి.మీ మోసుకెళ్లిన గ్రామస్థులు - మంచు కారణంగా ఇబ్బందిపడుతోన్న హిమాచల్ ప్రజలు
🎬 Watch Now: Feature Video

హిమాచల్ ప్రదేశ్‌లో హిమపాతం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లాహౌల్- స్పితి జిల్లాలోని లాహౌల్‌కు చెందిన తాషి తండూప్ అనే వ్యక్తి అనారోగ్యానికి గురవగా... అతడ్ని ఆసుపత్రికి తరలించేందుకు స్థానికులు 15 కిలోమీటర్లు స్ట్రెచర్‌పై మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధాన రహదారికి చేరుకున్నాక అతడ్ని అటల్ టన్నెల్ ద్వారా జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు.