పాము గుడ్లను రక్షించి.. కృత్రిమంగా పొదిగించి! - కృత్రిమంగా పొదిగించిన పాము గుడ్లు
🎬 Watch Now: Feature Video
సాధారణంగా కోడిగుడ్లను కృత్రిమంగా పొదిగించడం మనం చూస్తూంటాం. అయితే కర్ణాటక మైసూర్ శివార్లలో తన కంటబడిన పాము గుడ్లను కృత్రిమ ఉష్ణోగ్రతలో పొదిగించాడో వ్యక్తి. సూర్యకార్తి అనే పాముల ప్రేమికుడు నగర శివార్లలో పనిచేస్తున్నప్పుడు 40 పాము గుడ్లను సేకరించి.. 2 నెలలు కృత్రిమ ఉష్ణోగ్రతలో పొదిగించాడు. 60 రోజుల తరువాత గుడ్డు నుంచి పాములు బయటకు వస్తోన్న దృశ్యాలను కెమెరాలో బంధించాడు.