గుంతలో పడిన గజరాజు- కాపాడిన అధికారులు - గుంతలో పడిన గజరాజు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 20, 2021, 1:51 PM IST

Updated : May 20, 2021, 2:06 PM IST

కర్ణాటక కొడగు ప్రాంతంలో గుంతలో పడిపోయిన ఓ ఏనుగును సురక్షితంగా బయటకు తీశారు అటవీ అధికారులు. ఆహారం కోసం వచ్చిన గజరాజు.. ప్రమాదవశాత్తూ కాఫీతోటలోని నుయ్యిలో పడిపోయింది. ఆ తోట యజమాని చూసి అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వారు.. తొలుత ఆ బావిలో చెట్ల కొమ్మలు, కర్రలు వేశారు. ఫలితం లేనందున.. జేసీబీని పిలిపించి గుంతలోని బురదను తొలగించి, వెడల్పు చేశారు. దీంతో క్షేమంగా బయటపడి అడవిలోకి పరుగెత్తింది ఆ ఏనుగు.
Last Updated : May 20, 2021, 2:06 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.