వరద బీభత్సం మధ్య 'సింహ రాజసం' - సింహాలు తప్పిపోలేదు
🎬 Watch Now: Feature Video
తౌక్టే తుపాను పెను బీభత్సం సృష్టించిన నేపథ్యంలో గుజరాత్లోని గిర్ అభయారణ్యంలో తీసిన ఓ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వరద నీటికి ఏమాత్రం భయపడకుండా అనేక సింహాలు వరుసగా ఓ కాలువను దాటుతున్న వీడియో వైరల్ అయింది. తౌక్టే తుపాను తర్వాత గిర్ అభయారణ్యంలో 18 సింహాలు కనిపించకుండా పోయాయన్న వార్తలను ఖండిస్తూ గుజరాత్ ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ కుమార్ గుప్తా ఈ వీడియో ట్వీట్ చేశారు. సింహాలన్నీ సురక్షితంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
Last Updated : May 20, 2021, 7:53 PM IST