రహదారి విస్తరణ కోసం 19కి.మీ మానవహారం - 19కిమీ మేర మానవహారం
🎬 Watch Now: Feature Video
స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రజలు చేసే పోరాటాల గురించి నిత్యం వింటూనే ఉంటాం. ఉత్తరాఖండ్‌కు చెందిన చమోలీ వాసులు కూడా తమ రహదారిని విస్తరించాలని పోరుబాట పట్టారు. 19 కిలోమీటర్ల మేర మానవహారం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని సింపీత్ కురుద్‌ను నంద్‌ప్రయాగ్ ఘాట్‌తో అనుసంధానించే.. 19 కిలోమీటర్ల పొడవైన రహదారిని విస్తరించాలని డిమాండ్ చేస్తూ చమోలిలోని కర్ణాప్రయాగ్‌కు చెందిన 70గ్రామాల ప్రజలు ఆదివారం సుమారు మానవహారాన్ని చేపట్టారు. ప్రభుత్వం తమ డిమాండ్ నెరవేర్చే వరకు నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించారు.