వర్ధంతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి డ్యాన్స్.. వీడియో వైరల్ - రాజస్థాన్ న్యూస్
🎬 Watch Now: Feature Video
రాజస్థాన్ బాడ్మేర్ జిల్లాలో నిర్వహించిన అమర జవాను ప్రేమ్ సింగ్ వర్ధంతి కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌధరి (Kailash Chaudhary dance video) డ్యాన్స్ చేశారు. ఈ వర్ధంతి కార్యక్రమాల్లో భాగంగా మూడు రోజుల పాటు కబడ్డీ పోటీలు నిర్వహించారు. చివరి రోజు డీజే పాటకు గుంపుగా కొందరు డ్యాన్స్ చేయటం ప్రారంభించారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి సైతం డ్యాన్స్ చేశారు. అభిమానుల భుజాలపై కూర్చొని పాటకు తగ్గట్లుగా చిందులేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
Last Updated : Nov 9, 2021, 12:20 PM IST