ఆ బాక్సుతో 15 సెకెన్లలోనే కరోనా ఖతం! - కరోనా బాక్స్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8058852-519-8058852-1594965607570.jpg)
కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ... బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ వినూత్న ఆవిష్కరణతో ముందుకొచ్చింది. రోజువారీ ఉపయోగించే వస్తువులపై ఉండే కొవిడ్ సహా 70 రకాల సూక్ష్మజీవులు, వైరస్లను నిర్జీవం చేసే రేడియేషన్ 'బాక్స్'ను రూపొందించింది. దీని ద్వారా కూరగాయలు, ఆహార పదార్థాలు సహా మొబైల్ ఫోన్లు లాంటి వస్తువులను స్టెరిలైజేషన్, శానిటైజేషన్ చేయవచ్చని తెలిపింది. కేవలం 15 సెకెన్లలోనే 99.99 శాతం మేర శానిటైజేషన్ పూర్తవుతుందని సంస్థ చెబుతోంది. వీటిని ఇళ్లు, కార్యాలయాలు, ఆసుపత్రులు సహా ఎక్కడైనా వినియోగించవచ్చని స్పష్టం చేసింది.