కూలిన 15 అడుగుల గేటు- ఇద్దరు దుర్మరణం - ఇండియన్ కోచ్ ఫ్యాక్టరీ దుర్ఘటన
🎬 Watch Now: Feature Video
చెన్నైలోని ఇండియన్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్)లో 15 అడుగుల గేటు కూలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఫ్యాక్టరీలోకి భారీ యంత్రపరికరాలు తీసుకొచ్చిన ఒక ట్రక్కు గేటును ఢీకొనగా ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో సీనియర్ సెక్షన్ ఇంజినీర్ నర్గూనన్, సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ లకుమానన్ మరణించారు.