Live Video: ఆడపులి వేటను ఎప్పుడైనా చూశారా? - అడవి పందిని వేటాడిన ఆడపులి
🎬 Watch Now: Feature Video
Tigress Hunts Pig: అడవి పందిని ఆడపులి వేటాడటం ఎప్పుడైనా చూశారా..? అయితే ఈ వీడియో చూడండి. నూర్ అనే ఆడపులి 7నిమిషాలపాటు అడవి పందిని వేటాడి మరీ చంపింది. పులి పంజా నుంచి తప్పించుకునేందుకు పంది ప్రయత్నించినా సాధ్యం కాలేదు. రాజస్థాన్, సవాయ్ మాదోపుర్ జిల్లాలోని రణ్థంభోర్ జాతీయ పార్కులో ఈ ఘటన జరిగింది. పంది మెడ కొరికి అడవిలోకి లాక్కెళ్లింది నూర్. పులి వేటను దూరం నుంచి చూసిన పర్యటకులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ దృశ్యాలను కెమెరాలో బంధించారు.