నదిలో కొట్టుకుపోయిన ఏనుగులు- కాపాడేందుకు అధికారుల యత్నం
🎬 Watch Now: Feature Video
ఒడిశా కటక్ సమీపంలోని మహానదిలో మూడు ఏనుగులు చిక్కుకుపోయాయి. వాటిని రక్షించేందుకు అటవీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. నదిని దాటుతుండగా నాలుగు ఏనుగులు అదృశ్యమైనట్లు తెలిపారు. ముండాలి వంతెన వద్ద మూడు ఏనుగులను గుర్తించారు అధికారులు. వాటిని బయటికి తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల మహానది ఉధృతంగా ప్రవహిస్తోంది.