ఈసారి స్వదేశీ ఆయుధ సత్తా చాటనున్న భారత్ - drdo in republic day parade
🎬 Watch Now: Feature Video
దేశ రక్షణ రంగానికి తలమానికమైన భారత రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్డీఓ) ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్లో స్వదేశీ ఆయుధ సత్తాను చాటనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి వ్యవస్థ, నాగ్ క్షిపణి వ్యవస్థ, హెలీన హెలికాప్టర్, తక్కువ ఎత్తు నుంచి చేతిలో పట్టుకుని ప్రయోగించగలిగిన ఎంపీఏటీజీఎం క్షిపణి, హెలికాప్టర్ నుంచి ప్రయోగించగలిగే సంత్ మిస్సైల్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ అర్జున్ ఎంబీటీ ట్యాంక్లను ఈసారి ప్రపంచానికి చూపనుంది. ఈ ఏడాది కాలంలో అధునాతన పరిచిన అన్ని వ్యవస్థల్లో ముఖ్యమైన వాటిని ఈసారి 'రిపబ్లిక్ డే' పరేడ్లో ప్రదర్శించనున్నట్లు డీఆర్డీఓ వర్గాలు వెల్లడించాయి.
Last Updated : Jan 25, 2021, 11:48 AM IST