మురాజపం: దీపకాంతుల్లో తేజోవంతంగా పద్మనాభ ఆలయం - కేరళ త్రివేండ్రంలోని పద్మనాభస్వామి ఆలయం మురాజపం
🎬 Watch Now: Feature Video
కేరళ తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయంలో 56 రోజుల పాటు సాగిన 'మురాజపం' ఘనంగా ముగిసింది. గత ఏడాది నవంబరు 21వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని లక్షదీపోత్సవం వేడుకతో ఉద్యాపన పలికారు. దీపకాంతుల్లో ఆలయమంతా తేజోవంతంగా వెలిగిపోయింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు, విదేశీయులు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలోని వివిధ వేద పాఠశాలలకు చెందిన మతాధిపతులు ఏడు దశలుగా నిర్వహించి వేదాలను పఠించారు. ప్రతి ఆరేళ్లకోసారి ఈ మురాజపాన్ని జరుపుతారు ఆలయ నిర్వహకులు.