ETV Bharat / health

పండగ నాన్ వెజ్ తేడా కొట్టేసిందా? - కడుపులో గడబిడ, నొప్పి ఉంటే ఇలా చేయండి! - STOMACH ACHE HOME REMEDIES

- గ్యాస్ బాధితులకూ మంచి రిలీఫ్ - ఈ చిట్కాలు పాటించాలంటున్న నిపుణులు

Sankranti Mutton
Sankranti Mutton (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 16, 2025, 12:48 PM IST

Updated : Jan 16, 2025, 2:09 PM IST

Stomach Ache Home Remedies : సంక్రాంతి సంబరాలు ముగిశాయి. తెలుగు రాష్ట్రాల్లో జనం ఆనందాల్లో మునిగి తేలారు. కోడి పందేలు మొదలు, మందు, విందు పార్టీలతో ఆడిపాడారు. అయితే, పండగపూట దండిగా తిన్న మటన్​ కొందరికి ఇబ్బందులు తెచ్చి పెడుతుంది. ఎక్కువగా తినడం వల్ల కావొచ్చు, మద్యం కాంబినేషన్​ వల్ల కావొచ్చు, సున్నితమైన జీర్ణవ్యవస్థ వల్ల కావొచ్చు కడుపు నొప్పి, మోషన్స్ ఇబ్బంది పెడతాయి. ఇలాంటి వారు మందులు వేసుకోవడం ద్వారా రిలీఫ్ పొందే ప్రయత్నం చేస్తుంటారు. కానీ, అనవసరంగా మందులేవీ మింగకుండానే, ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే నాన్-వెజ్ తిన్న తర్వాత కడుపు నొప్పి రావడం అనేది చాలా సాధారణ సమస్య. రెస్ట్​ తీసుకొని, కొన్ని ప్రికాషన్స్​ పాటిస్తే తగ్గిపోతుందని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పనులు చేయాలని సూచిస్తున్నారు.

అల్లం టీ: కడుపు నొప్పిని తగ్గించడంలో అల్లం చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండి, వెంటనే నొప్పిని తగ్గించే పని మొదలు పెడుతుంది. అందువల్ల కాస్త అల్లం చాయ్ చేసుకొని వేడి వేడిగా తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

జీరా వాటర్: జీర్ణక్రియను మెరుగుపరచడంలో జీలకర్ర వాటర్ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది కడుపులో గ్యాస్​ పట్టేస్తే కూడా తగ్గిస్తుంది.

దాల్చిన చెక్క: కిచెన్​లో ఉండే మరో చక్కటి ఔషధం దాల్చిన చెక్క. ఇది కడుపులో తిమ్మిరిని తగ్గిస్తుంది. కాసిన్ని నీళ్లలో దాల్చిన చెక్క వేసి, వేడి చేసిన తర్వాత తాగేయమంటున్నారు.

పుదీనా, మిరియాలు : కడుపులో కండరాలను సడలించడంలో ఇవి ఎఫెక్టివ్​గా పనిచేస్తాయట. తద్వారా కడుపు నొప్పిని తగ్గిస్తాయి. అందుకే ఇవి రెండూ కలిపి వాటర్​ను మరిగించి తీసుకోవాలని చెబుతున్నారు.

మజ్జిగ: కడుపు నొప్పి, గ్యాస్​ను తగ్గించడంలో ఎంతో ప్రభావంగా పనిచేస్తుంది. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి వీలైనంత ఎక్కువ మజ్జిగ తాగేస్తే సరి. ఎంతో రిలీఫ్ వచ్చేస్తుందని సూచిస్తున్నారు.

వెచ్చని నీరు : దాహం వేసినప్పుడు చల్లటి నీరు తాగకూడదు. కాస్త వేడి చేసి గోరువెచ్చగా తీసుకోవాలి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు నొప్పి కూడా తగ్గుతుంది.

పండ్లు, కూరగాయలు : నాన్ వెజ్​ కారణంగానే సమస్య వచ్చినప్పటికీ, కాస్త తగ్గినట్టు అనిపించగానే మళ్లీ లాగించే ప్రయత్నం చేస్తుంటారు కొందరు. కానీ, ఇలా చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. పొట్టకు రెస్ట్​ ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇందుకోసం పండ్లు, కూరగాయల భోజనం తీసుకోవాలని చెబుతున్నారు. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

ఇవి తగ్గించండి: ఇప్పటికీ మోషన్స్, కడుపు నొప్పి వంటివి ఇబ్బంది పెడుతుంటే మసాలా ఆహారాలేవీ తీసుకోవద్దు. ఇవి కడుపును మరింతగా చికాకు పెట్టవచ్చు. అదేవిధంగా చక్కెర పదార్థాలు కూడా తినకూడదు.

త్రిఫల చూర్ణం: నొప్పి మరింతగా ఇబ్బంది పెడుతూ ఉంటే గనక త్రిఫల చూర్ణం తీసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇది జీర్ణక్రియను మరింతగా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. కడుపులోని విషాన్ని తొలగిస్తుందట.

విశ్రాంతి : పైన చేయాల్సినవి చేసి, విశ్రాంతి తీసుకోవాలి. కదలకుండా పడుకొని, కాస్త ఎక్కువసేపు నిద్రపోతే సమస్య తగ్గిపోతుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి :

సంక్రాంతి మటన్ ముక్క సరిగా ఉడకట్లేదా? - ఇలా చేస్తే మెత్తగా ఉడికిపోద్ది!

ఈ చలిలో వేడివేడిగా "చింతపండు చారు" - ఘాటుగా జుర్రుకోండిలా!

Last Updated : Jan 16, 2025, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.