చెన్నై విమానాశ్రయంలో జిన్‌పింగ్‌కు ఘనస్వాగతం - అంతర్జాతీయ వార్తలు తెలుగులో
🎬 Watch Now: Feature Video
రెండు రోజుల భారత పర్యటన కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చెన్నై చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు తమిళనాడు గవర్నర్ పురోహిత్, సీఎం పళనిస్వామి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆలయ పూజారుల వేద మంత్రాల నడుమ జిన్‌పింగ్‌కు ఘన స్వాగతం లభించింది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా జిన్‌పింగ్‌ను ఆహ్వానించారు.
Last Updated : Oct 11, 2019, 3:21 PM IST