25 వేల సబ్బులతో కరోనాపై అవగాహన కల్పిస్తోన్న విద్యార్థులు - 25,000 సబ్బులతో కరోనాపై అవగహన

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 14, 2020, 2:46 PM IST

ప్రపంచ దేశాలతో పాటు భారత్​లోనూ కరోనా విజృంభిస్తోన్న వేళ.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఈ నేపథ్యంలోనే కరోనాపై అవగాహన కల్పించేందుకు తమిళనాడులోని కొలతూర్​ ఎవర్​విన్​ విద్యాశ్రమ్​ పాఠశాల విద్యార్థులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఏకంగా 25 వేల సబ్బులతో మొసాయిక్​ ఆకృతిని తీసుకొచ్చారు. అందులో 'చేతులు శుభ్రంగా ఉంచుదాం.. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం' అని సబ్బులతో పేర్చారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు చూపరులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.