పక్కా స్కెచ్‌తో శివాలయంలో చోరీ - జబల్పుర్
🎬 Watch Now: Feature Video
మధ్యప్రదేశ్ జబల్‌పుర్‌లోని ప్రజ్ఞాధామ్ ఆశ్రమంలో ఉన్న శివుని గుడిలో దొంగతనం జరిగింది. ఈశ్వరుని విగ్రహంపై ఉన్న వెండి గొడుగును, ఇతర ఆభరణాలను పక్కా ప్రణాళికతో అపహరించారు ముగ్గురు దుండగులు. ఇద్దరు దొంగలు ఆలయంలోనికి వెళ్లగా, మరొకరు బయట కాపలా ఉన్నారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. సమాచారం అందుకున్న కటాంగీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, దర్యాప్తు ప్రారంభించారు.