ఫోన్​ మాట్లాడుతూ భవనం పైనుంచి పడి మహిళ మృతి - ఫోన్​ మాట్లాడుతూ రెండో అంతస్థు నుంచి పడి మహిళ మృతి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 21, 2019, 5:08 PM IST

ఓ భవనం రెండవ అంతస్తు పైనుంచి ప్రమాదవశాత్తు పడిపోయి ఓ మహిళ మృతి చెందిన ఘటన పుదుచ్చేరిలో జరిగింది. ఈ నెల 17న రాత్రి భర్తతో ఫోన్‌లో మాట్లాడడానికి ఇంటి టెర్రస్‌ పైకి వెళ్లిన మహిళ ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయింది. ఈ దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. పెరంబలూరుకు చెందిన సెల్వి అనే మహిళ.. పుదుచ్చేరిలోని తన పుట్టింటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. సెల్వికి రెండేళ్ల క్రితం శరవణన్‌ అనే వ్యక్తితో వివాహమైంది. వారికి 9 నెలల బాబు ఉన్నాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.