కరోనా రోగిని మోస్తూ 7 కి.మీల నడక - ఉత్తరాఖండ్ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 28, 2021, 6:24 PM IST

ఉత్తరాఖండ్​లో రాష్ట్ర విపత్తు స్పందన దళం(ఎస్​డీఆర్​ఎఫ్​) మానవత్వం చాటుకుంది. కొండ ప్రాంతంలో కరోనా సోకిన గోపాల్​ సింగ్​ అనే వృద్ధుడిని ఇంటి నుంచి అంబులెన్సు వరకు 7 కిలోమీటర్లు కాలినడకన మోసుకెళ్లారు సిబ్బంది. ఈ ఘటన పితోరాగఢ్​ జిల్లాలో శుక్రవారం జరిగింది. బుయి గ్రామానికి చెందిని 82 ఏళ్ల గోపాల్​ సింగ్​కు అయినవాళ్లెవరూ లేరు. అతడ్ని ఆస్పత్రికి తరలించడానికి స్థానికులూ ముందుకురాలేదు. దీంతో ఈ సమాచారం అందుకున్న వెంటనే ఎస్​డీఆర్​ఎఫ్​ బృందం బుయి గ్రామానికి వెళ్లి, సాయం చేసింది. సబ్​ డివిజన్​ మున్సియారీ నుంచి 25కి.మీల దూరంలో లీలమ్​ ప్రాంతం ఉంటుంది. అక్కడి నుంచి ఎగుడు దిగుడు నేలలపై 7కి.మీలు ప్రయాణిస్తే బుయికి చేరుకుంటారు. అలాంటి మార్గంలో దాదాపు 3 గంటలు శ్రమించి.. రోగిని అంబులెన్సు వరకు మోసుకెళ్లారు ఎస్​డీఆర్​ఎఫ్​ జవాన్లు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.