హైవేపై భారీ కొండచిలువ.. వాహనదారులు షాక్ - హరిద్వార్ రోడ్లపై పైథాన్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13788968-thumbnail-3x2-collage.jpg)
Python on Highway Haridwar: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఓ కొండచిలువ రహదారిపై ప్రత్యక్షమైంది. సర్వానంద్ ఘాట్ వద్ద దిల్లీ హైవేపైకి వచ్చిన భారీ పైథాన్.. వాహనదారులను ఆందోళనకు గురిచేసింది. పలు వాహనాల కిందకు వెళ్లేందుకు ప్రయత్నించింది. కొండచిలువను చూసి వాహనాలు ఆపేయడం వల్ల రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొద్దిసేపు అటూఇటూ తిరిగిన పైథాన్.. చివరకు పక్కన ఉన్న అడవిలోకి వెళ్లిపోయింది.