Viral Video: మాస్క్ ధరించలేదని జవాన్పై పోలీసుల దాడి! - పోలీసుల దాడి
🎬 Watch Now: Feature Video
మాస్క్ ధరించని కారణంగా ఓ సైనికుడిపై దాడి చేశారు పోలీసులు(police attack). ఈ ఘటన ఝార్ఘండ్లోని మయూర్‌హండ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మ బజార్లో జరిగింది. బైక్పై వస్తున్న ఆర్మీ జవాను మాస్క్ ధరించలేదని అతనిపై పోలీసులు కర్రలతో దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలైంది. పోలీసుల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఎస్పీ.. దర్యాప్తునకు ఆదేశించారు.