కొవిడ్ నిబంధనలు గాలికి.. 241 మందిపై కేసు! - మహారాష్ట్ర పాల్గఢ్ వార్తలు
🎬 Watch Now: Feature Video
కరోనా మహమ్మారి వ్యాప్తి ఆందోళనకరంగా మారుతున్నా పలు ప్రాంతాల ప్రజలు ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మహారాష్ట్ర పాల్గఢ్ జిల్లాలోని అసేరీ ఘాట్ కోటకు వందల సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. ఒక్కరికి కూడా మాస్క్లు లేకపోవటం గమనార్హం. ఆదివారం (జూన్ 20న) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 241 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.