వైరల్: ఆలోచన హిట్... పట్టాలపై తాత సేఫ్ - పట్టాలు
🎬 Watch Now: Feature Video
కర్ణాటక బగల్కోట్లో ఓ వృద్ధుడు చాకచక్యంగా మరణం నుంచి తప్పించుకున్నాడు. శిరురు రోడ్డులో పట్టాలు దాటుతుండగా రైలు ఆ వృద్ధుడివైపు దూసుకెళ్లింది. ఆ వృద్ధుడు అప్రమత్తమై పట్టాలపై నిలువుగా పడుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు... రైలు వెళ్లేవరకు అలానే ఉండమని తాతను హెచ్చరించారు. ఇంతలో రైలు డ్రైవర్ బండి ఆపివేశారు. వెంటనే ఆ వృద్ధుడు బయటకు పరిగెత్తాడు. ఈ దృశ్యాలు స్థానికుల కెమెరాకు చిక్కాయి.