Few Companies Decreased Liquor Rates in AP : ఆంధ్రప్రదేశ్‌లో 11 కంపెనీలు మద్యం ధరలను తగ్గించాయి. గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం మూల ధరను భారీగా పెంచిన సరఫరా కంపెనీల్లో కొన్ని ఇప్పుడు వాటంతట అవే తగ్గించుకున్నాయి. గత ప్రభుత్వంలోని కొందరు నేతలు కంపెనీల నుంచి కమీషన్లు తీసుకునేందుకు వీలుగా, వాటికి చెల్లించే బేసిక్ ప్రైస్‌ను భారీగా పెంచారన్న ఫిర్యాదులు ఉన్నాయి.
ఎమ్మార్పీపై రూ.30 వరకు తగ్గుదల : వినియోగదారుల డిమాండ్ మేరకు కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానం తీసుకొచ్చి పారదర్శకంగా ఆర్డర్లు ఇస్తోంది. ఈ నేపథ్యంలో సుమారు 11 కంపెనీలు వాటి బేసిక్ ప్రైస్‌ను తగ్గించుకున్నాయి. ఫలితంగా ఆయా కంపెనీల నుంచి ఏపీ బెవరేజస్ సంస్థ మద్యం కొనే ధర తగ్గింది. ఆయా బ్రాండ్ల ఆధారంగా ఒక్కో క్వార్టర్ ధర ఎమ్మార్పీపై రూ.30 వరకు తగ్గుతుంది. దీంతో వినియోగదారులకు ఊరట కలగనుంది.