ఆడుతూ.. పాడుతూ.. పండగలా అంత్యక్రియలు! - old man dancing funeral
🎬 Watch Now: Feature Video
Old Man Dancing Funeral Procession: అంత్యక్రియలంటే సాధారణంగా మృతుడి కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటారు. కానీ మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో అంత్యక్రియలను మాత్రం పండగలా చేసుకున్నారు. దేవిపురా భువవదా గ్రామంలో 100 ఏళ్ల జామ్ సింగ్ చనిపోయాడు. దీంతో అతని అంత్యక్రియలను గ్రామస్థులు పాటలు పాడుతూ.. నృత్యాలతో ఊరేగింపుగా నిర్వహించారు. ఎవరైనా నవ్వుతూ చనిపోతే అంత్యక్రియలను ఇలాగే జరుపడం ఇక్కడి గిరిజనుల సంప్రదాయం. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.