ETV Bharat / business

అద్భుతమైన డిజైన్, ప్రీమియం ఫీచర్లు.. కియా కొత్త కారు అదుర్స్!- జనవరి 3 నుంచి బుకింగ్స్ - KIA SYROS SUV UNVEILED IN INDIA

కాంపాక్ట్ SUV సెగ్మెంట్​లో కియా నుంచి 'సైరాస్'- పూర్తి డీటెయిల్స్ ఇవే..!

Kia Syros
Kia Syros (Photo Credit- Kia India)
author img

By ETV Bharat Tech Team

Published : 6 hours ago

Kia Syros SUV Unveiled in India: దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ కియా తన కాంపాక్ట్ SUV సెగ్మెంట్​లో కొత్త మోడల్​ను తీసుకొచ్చింది. 'సైరాస్‌' పేరుతో కంపెనీ దీన్ని పరిచయం చేసింది. జనవరి 3వ తేదీ నుంచి దీని​ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి నుంచి డెలివరీలు మొదలవుతాయని పేర్కొంది.

కియా ఇండియా ఈ కారును అద్భుతమైన డిజైన్‌, ఆకర్షణీయమైన లుక్​తో తీసుకొచ్చింది. అంతేకాక దీనిలో కొన్ని సరికొత్త, ప్రీమియం ఫీచర్లను చేర్చింది. వీటిని కంపెనీకి చెందిన ఏ ఇతర SUV లేదా సబ్-4 మీటర్ సెగ్మెంట్ మోడల్స్​లోనూ అందించలేదు. ఈ కారు పవర్​ట్రెయిన్​ మాత్రం ప్రస్తుతం ఉన్న కియా సోనెట్ మాదిరిగానే పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌ ఆప్షన్లతో వస్తుంది.

Kia Syros Front Profile
Kia Syros Front Profile (Photo Credit- Kia India)

ట్రిమ్స్:

కంపెనీ ఈ కారును ఆరు ట్రిమ్​ ఆప్షన్లలో అందిస్తుంది.

  • HTK
  • HTK (O)
  • HTK+
  • HTX
  • HTX+
  • HTX+ (O)

ఈ కొత్త కియా సైరాస్ బుకింగ్స్​ బుకింగ్ జనవరి 3, 2025 నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. అయితే ప్రస్తుతం వీటి ధరలపై ఎలాంటి సమాచారం అందించలేదు. త్వరలో ధరను ప్రకటించే అవకాశం ఉంది. వీటి డెలివరీలు మాత్రం ఫిబ్రవరి 2025 నుంచి ప్రారంభంకానున్నాయి.

డిజైన్: కియా ఈ సైరాస్​కు సాధారణ బాక్సీ SUV డిజైన్‌ను అందించింది. ఈ డిజైన్​ను కంపెనీకి చెందిన ప్రీమియం ఎలక్ట్రిక్‌ SUV EV9 నుంచి తీసుకున్నారు. దీని ముందు భాగంలో నిలువుగా పేర్చిన 3-ప్యాడ్ LED హెడ్‌లైట్లు, LED డీఆర్​ఎల్స్​ ఉన్నాయి. ఈ కారు సైడ్​ ప్రొఫైల్​లో లార్జ్ విండో ప్యానెల్స్, సి-పిల్లర్‌కు సమీపంలో కింక్డ్ బెల్ట్‌లైన్, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్​ను అందించారు.

Kia Syros Side Profile
Kia Syros Side Profile (Photo Credit- Kia India)

ఈ కారు షోల్డర్ లైన్, ఫ్లష్-టైప్​ డోర్​ హ్యాండిల్స్​ను కలిగి ఉంది. ఈ డోర్​ హ్యాండిల్స్​తో మార్కెట్లోకి తీసుకొచ్చిన కంపెనీ లైనప్‌లో మొదటి ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) మోడల్ ఇదే. ఇందులో మరొక ప్రత్యేకత ఏంటంటే.. బాడీ కలర్​లో యునిక్ డిజైన్​తో B-పిల్లర్ డోర్ పిల్లర్ ఎలిమెంట్ ఉంది. ఇక ఈ కారు వెనక వైపున సొగసైన L-షేప్డ్​ LED టైల్‌లైట్లు, ఫ్లాట్ టెయిల్​గేట్ ఉన్నాయి.

కలర్ ఆప్షన్స్:

  • ఇంటెన్స్‌ రెడ్‌
  • ఫ్రాస్ట్‌ బ్లూ
  • ప్యూటర్‌ ఆలివ్‌
  • ఆరా బ్లాక్‌ పెరల్‌
  • గ్రావిటీ గ్రే
  • ఇంపీరియల్‌ బ్లూ
  • గ్లేసియర్‌ వైట్ పెరల్‌
  • స్పార్కింగ్‌ సిల్వర్‌

ఇంటీరియర్: కియా సైరాస్ ఇంటీరియర్ విషయానికొస్తే.. ఇందులో లెవల్-2 ADAS సూట్, న్యూ 2-స్పోక్ స్టీరింగ్ వీల్, 8-స్పీకర్ హర్మాన్ కార్డాన్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో EPB, యాంబియంట్ లైటింగ్, 360-డిగ్రీ కెమెరా, కియా కనెక్ట్​ వంటి ఫీచర్లతో పాటు వెంటిలేషన్, రిక్లైన్ ఫంక్షన్ వైర్‌లెస్ ఛార్జర్‌తో వెనక సీట్లు ఉన్నాయి.

Kia Syros Interior
Kia Syros Interior (Photo Credit- Kia India)

వీటితో పాటు ఈ కారు.. ఆటో-డిమ్మింగ్ IRVM, ఫోర్-వే పవర్డ్ డ్రైవర్ సీట్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డ్రైవ్ అండ్ ట్రాక్షన్ మోడ్స్​, డ్యూయల్ 12.3-అంగుళాల స్క్రీన్, టచ్-బేస్డ్ AC కంట్రోల్స్, OTA అప్‌డేట్స్, ఎయిర్ ప్యూరిఫైయర్, డ్యూయల్​ కెమెరాలతో డాష్ క్యామ్, ప్యాడిల్ షిఫ్టర్స్, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ వంటి ఫీచర్లతో వస్తుంది.

Kia Syros Safety Features
Kia Syros Safety Features (Photo Credit- Kia India)

ఇంజిన్ ఆప్షన్స్: ఈ కొత్త కియా సైరాస్​లో రెండు ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మొదటిది 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్. ఇది 118bhp పవర్, 172Nm టార్క్ అందిస్తుంది. ఇక రెండోది 114bhp పవర్, 250Nm టార్క్ అందించే 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ స్టాండర్డ్‌గా అందుబాటులో ఉంటుంది. అయితే 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, 7-స్పీడ్ DCT యూనిట్ ఆప్షన్లుగా అందుబాటులో ఉంటాయి.

రాయల్ ఎన్​ఫీల్డ్ బైక్ కొంటున్నారా? అయితే ఆగండి.. త్వరలో 4 కొత్త మోడల్స్!

'స్కోడా కైలాక్‌' క్రేజ్ చూశారా?- 10రోజులకే 10వేల బుకింగ్స్.. ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తోందిగా..!

బైక్ లవర్స్​కు బ్యాడ్ న్యూస్- ఆ మోడల్స్ ఇక మార్కెట్లో ఉండవుగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.