ఆలూ చిప్స్ కాదు.. కూరగాయల చిప్స్ - తింటే ఏమవుతుందో తెలుసా! - VEGETABLE CHIPS
- మార్కెట్లో పెరుగుతున్న వెజ్ చిప్స్ - పలు సూచనలు చేస్తున్న నిపుణులు
Published : Dec 20, 2024, 4:35 PM IST
VEGETABLE CHIPS : సరదాగా సినిమా చూస్తూనో, సీరియస్‌గా క్రికెట్ మ్యాచ్ చూస్తూనో చిప్స్ ప్యాకెట్ చింపి, అందులో నుంచి ఒక్కో చిప్స్ తీసి, కరకరా అనిపిస్తుంటే.. ఆ మజా నెక్స్ట్ లెవల్ అన్నట్టుగా ఉంటుంది చాలా మందికి! కానీ.. అవి తినడం చాలా అనారోగ్యమని నిపుణులు హెచ్చరిస్తుంటారు. అయినప్పటికీ.. ఆ టేస్ట్‌ను వదల్లేక లాగిస్తూనే ఉంటారు. అయితే.. ప్రతిదానికీ ఓ ప్రత్యామ్నాయం వెతుక్కున్నట్టే.. ఈ చిప్స్‌కు సైతం ఆల్టర్నేట్ వచ్చేసింది. అవే వెజిటబుల్ చిప్స్. మరి, వీటిని తినడం మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారు? అనే వివరాలు ఇక్కడ చూద్దాం.
పట్టణాలు, నగరాల్లో నివసించే వారి లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. గంటల తరబడి కూర్చోవడం, బయటి తిండి ఎక్కువగా తినడం. ఈ రెండు కారణాలతో ఆరోగ్యం చాలా దెబ్బ తింటోంది. ఈ విషయాన్ని కొందరు గుర్తించి, నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారు. హెల్దీ ఫుడ్ వైపు చూస్తున్నారు. బాగా నచ్చే అనారోగ్యకర ఆహార పదార్థాలకు.. ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నారు. అలాంటి వాటిల్లో కూరగాయల చిప్స్ ఒకటి. "హెల్దీ స్నాక్స్" అంటూ.. సోషల్‌మీడియాలో ఫుల్లుగా వైరల్ అవుతున్నాయి.
బీట్‌రూట్, క్యారెట్, బెండకాయ, ముల్లంగి, టమాటా.. ఇలా ప్రతికూరగాయతోనూ కరకరలాడే చిప్స్ తయారు చేస్తున్నారు. వీటిని నూనెలో డీప్ ఫ్రై చేయరు. వాక్యూమ్ ఫ్రై, డీహైడ్రేషన్ పద్ధతుల్లో తయారు చేస్తారు. దీంతో.. చిప్స్ లవర్స్ అందరూ సూపర్ ఆప్షన్ కదా అంటూ తినేస్తున్నారు. మరి, నిజంగా ఇవి మంచివేనా అంటే.. కొంచెం మాత్రమే మంచివి అంటున్నారు నిపుణులు! ఇప్పటి వరకూ తిన్న చిప్స్‌తో పోలిస్తే.. కూరగాయల చిప్స్‌లో అనారోగ్యకరమైన ఫ్యాట్, కేలరీస్ తక్కువగా ఉంటాయి. కానీ.. ఎక్కువగా తింటే వీటితోనూ ముప్పు తప్పదని అంటున్నారు.
ఎందుకంటే.. ఈ చిప్స్‌లో ఆయిల్ మాత్రమే ఉండదు. కానీ.. వాక్యూమ్ ఫ్రై, డీహైడ్రేషన్ పద్ధతుల్లో వీటిని తయారు చేయడం వల్ల ఇందులోని పోషకాలు తగ్గిపోతాయి. తగ్గితే తగ్గాయిలే అనుకున్నా.. మరో నష్టం ఉంది. టేస్ట్ పెంచడానికి, జనాలను అట్రాక్ట్ చేయడానికి ఆర్టిఫీషియల్ కలర్స్, ఎక్కువ సోడియం, షుగర్స్ వాడే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇవి బీపీ, షుగర్ పెరగడానికి కారణం కావొచ్చని హెచ్చరిస్తున్నారు.
కాబట్టి, చిప్స్ ఏవైనా సరే తినకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ తప్పదు అనుకుంటే.. కూరగాయల చిప్స్ బెటర్ అంటున్నారు. అవి కూడా ఏదిబడితే అది తినడానికి లేదంటున్నారు. కొనేముందు తప్పకుండా.. తయారీలో ఎలాంటి పదార్థాలు వాడారో ప్యాకెట్ మీద చూసి కొనుగోలు చేయాలని చెబుతున్నారు. ముఖ్యంగా.. వాటిపై "FSSI" సర్టిఫికేషన్ ఉందా? అనేది చూసుకోమంటున్నారు. ఈ చిప్స్ ఎంత నచ్చినా.. ఎప్పుడో ఒకసారి, అది కూడా చాలా తక్కువ తినాలని చెబుతున్నారు. హెల్దీగా ఉంటాలంటే మాత్రం.. తాజా కూరగాయలను వండుకుని తినాల్సిందేనని సూచిస్తున్నారు.
Conclusion: